మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 17:16:34

‘ప్రధాన నిందితుడిని పట్టుకునే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లం’

‘ప్రధాన నిందితుడిని పట్టుకునే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లం’

లక్నో : ఈ నెల 20న విజ‌య్‌నగర్‌ ప్రాంతంలో దుండగుల గాయపడ్డ జర్నలిస్ట్ విక్రమ్‌సింగ్‌ జోషి బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సందర్భంగా మృతుడి మేనల్లుడు ఆశిష్‌ మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని స్పష్టం చేశారు. కమాల్ ఉద్ దిన్ కొడుకుతో సహా కొందరు అబ్బాయిలు మా చెల్లిని ఈవ్‌టీజ్‌ చేసే వారు. ఈ సంఘటన రోజున ఆమె పుట్టిన రోజని తెలిపాడు. మామయ్యతో కలిసి చెల్లెలు ఇంటికి వస్తుండగా కమల్-ఉద్-దిన్ కుమారుడు అతనిపై దాడి చేసి కాల్చి చంపాడని చెప్పాడు.

కమల్-ఉద్-దిన్ కుమారుడితో పాటు రవి, భంగికా అభిషేక్‌, కమాలుద్దీన్‌ కొడుకు ఉన్నారని, వారు మామయ్య తలలో గన్‌తో కాల్చారని, తలపై రాడ్‌తో కొట్టాడని తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో 15-20 మంది ఉన్నారని తెలిపాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ‘పోలీసులు ఏమీ చేయడం లేదు. వారు అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ముగ్గురు అనవసరంగా అరెస్టయ్యారు. ప్రధాన నిందితుడిని ఇక్కడికి తీసుకువచ్చే వరకు మా మేనమామ మృతదేహాన్ని తీసుకెళ్లమని’ విక్రమ్‌ స్పష్టం చేశాడు. అలాగే విక్రమ్‌ సోదరి మాట్లాడుతూ ‘జూలై 16న కొంతమంది వ్యక్తులతో గొడవ జరిగింది.

నా సోదరుడు విక్రమ్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ యువకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, దుర్భాషలాడుతూ ఉన్నారు’. ‘నా సోదరుడి హత్యకు పోలీసులు ప్లాన్ వేశారు. స్టేషన్ ఇన్‌చార్జిదే బాధ్యత. ఆయన పేరు నాకు తెలియదు. తక్షణ నిర్ణయంపై మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అన్నారు. ‘దీని వెనుక ఉన్న వ్యక్తులు ఛోటు, కమలూ కుమారుడు, అభిషేక్, ఆకాశ్ బిహారీ, రవి దీవాన్’ అని ఆరోపించారు. కాగా, బుల్లెట్ గాయం కారణంగా జోషి తలలో నరాలు బాగా దెబ్బతినడంతో మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా, పోలీసులు చర్య తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించగా.. స్టేషన్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేసి శాఖాపరమైన విచారణను చేపట్టారు ఉన్నతాధికారులు.

ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తన మేనకోడలిని కొందరు వ్యక్తులు వేధిస్తున్నారంటూ విక్రమ్ జోషి విజ‌య్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల తర్వాత సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo