బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 08:31:43

ప్ర‌భుత్వానికి రూ.కోటి ప‌రిహారం ప్ర‌తిపాద‌న: ఢిల్లీ సీపీ ‌

ప్ర‌భుత్వానికి రూ.కోటి ప‌రిహారం ప్ర‌తిపాద‌న: ఢిల్లీ సీపీ ‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న అమిత్ కుమార్ క‌రోనా పాజిటివ్ లక్ష‌ణాలు క‌నిపించిన కొన్ని గంట‌ల్లోనే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్ఎన్ శ్రీవాస్త‌వ మాట్లాడుతూ..విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాల‌కు డిపార్టుమెంట్ అన్ని విధాల అండ‌గా నిలుస్తుంద‌న్నారు. పాల‌సీ ప్ర‌కారం విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ను ఢిల్లీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తామ‌ని పేర్కొన్నారు. 

మ‌రోవైపు అమిత్ కుమార్ తో స‌న్నిహితంగా ఉన్న వారంద‌రికి సంబంధించిన ప‌రీక్ష‌ల నివేదిక ఇవాళ వచ్చింద‌ని, వారంద‌రినీ క్వారంటైన్ లో ఉంచామ‌ని ఢిల్లీలో పోలీస్ అధికారి ఒక‌రు తెలిపారు. అమిత్ కుమార్ ను చేర్చుకోవ‌డానికి రెండు ప్ర‌భుత్వం ఆస్ప‌త్రులు తిర‌స్క‌రించాయ‌ని..సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగానే అమిత్ కుమార్ చ‌నిపోయాడ‌ని అత‌ని స్నేహితులు ఆరోపించారు. హ‌ర్యానా లోని సోనిప‌ట్ ప్రాంతానికి చెందిన అమిత్ కుమార్ కు భార్య,మూడేళ్ల కొడుకున్నాడు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo