మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:10:15

ప్ర‌ధాని ఇంటి ముందు ఆందోళ‌న‌కూ సిద్ధం: గెహ్లాట్‌

ప్ర‌ధాని ఇంటి ముందు ఆందోళ‌న‌కూ సిద్ధం: గెహ్లాట్‌

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ ప‌రిస్థితులు రోజురోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతున్న‌ది. సీఎం ఫోన్‌లో విజ్ఞ‌ప్తి చేసినా, త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్లి అడిగినా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ స్వరం పెంచారు. అవసరమైతే ఈ విష‌యంలో తాము రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుస్తామని ఆయ‌న‌ చెప్పారు. 

అయినా, అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణకు అనుమ‌తి రాక‌పోతే ప్రధాని న‌రేంద్ర‌మోదీ నివాసం ముందు ఆందోళనకు సిద్ధమని అశోక్ గెహ్లాట్‌ ప్రకటించారు. తమ వర్గం ఎమ్మెల్యేలు ఉన్న ఫెయిర్‌మాంట్‌ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం గెహ్లాట్ నివాసంలో క్యాబినెట్ భేటీకి ముందు సీఎల్పీ స‌మావేశం జ‌రిగింది.   

అనంతరం క్యాబినెట్ స‌మావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోరుతూ ఒక సిఫార‌సు లేఖకు ఆమోదం తెలిపారు. ఆ‌ సిఫార‌సు లేఖతో మంత్రులు గవర్నర్‌ను‌ కలిసేందుకు వెళ్లారు. దీంతో గవర్నర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొన్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo