సోమవారం 18 జనవరి 2021
National - Nov 25, 2020 , 13:26:51

పోలీసుల‌తో బూట్లు నాకిస్తా.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌!

పోలీసుల‌తో బూట్లు నాకిస్తా.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజు బెనర్జీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే పోలీసుల‌తో బూట్లు నాకిస్తాన‌ని అన్నారు. రాష్ట్రంలో గూండా రాజ్‌ను అంతం చేయ‌డానికి పోలీసులు ఏమీ చేయ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ రోజుల్లో బెంగాల్‌లో ఏం జ‌రుగుతోందో చూడండి. ఇదే గూండా రాజ్ బెంగాల్‌లో కొన‌సాగుతుందా?  పోలీసులు అస‌లు ఎలాంటి సాయం చేయ‌డం లేదు. ఇలాంటి పోలీసుల‌తో ఏం చేస్తాం?  వాళ్ల‌తో బూట్లు నాకిస్తా అని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజు బెన‌ర్జీ అన్నారు. 2021లో బెంగాల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను బీజేపీ నేత‌లు త‌ర‌చూ తెర‌పైకి తెస్తున్నారు. బెంగాల్‌లో మ‌హిళ‌ల‌కు అస‌లు ర‌క్ష‌ణ లేద‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలాష్ విజ‌య్‌వ‌ర్గియా కూడా ఆరోపించారు. ఓ మహిళ ముఖ్య‌మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.