బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 08:06:49

కరోనా సోకితే మమతా బెనర్జీని హత్తుకుంటా : అనుపమ్‌ హజ్రా

కరోనా సోకితే మమతా బెనర్జీని హత్తుకుంటా :  అనుపమ్‌ హజ్రా

కోల్‌కతా : ఒకవేళ తనకు కరోనా సోకితే పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని హత్తుకుంటానని బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్‌ హజ్రా అన్నారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంత బాధను అనుభవిస్తున్నాయో ఆమెకు తెలిసిరావడానికి ఈ పని చేస్తా. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాలను కిరోసిన్‌తో తగులబెడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ముఖం చూడటానికి కనీసం కుటుంబసభ్యులను కూడా అనుమతించడం లేదు. మమత సర్కార్‌ ఎంత దయనీయంగా వ్యవహరిస్తున్నదో దీన్నిబట్టి అర్థమవుతున్నదని మండిపడ్డారు. తమ  కార్యకర్తలు కరోనా కంటే పెద్ద శత్రువైన మమతా బెనర్జీతో పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo