బుధవారం 20 జనవరి 2021
National - Nov 30, 2020 , 18:10:13

ఆ చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌క‌పోతే ఎన్డీయే నుంచి త‌ప్పుకుంటాం!

ఆ చ‌ట్టాలు ర‌ద్దు చేయ‌క‌పోతే ఎన్డీయే నుంచి త‌ప్పుకుంటాం!

న్యూఢిల్లీ: కొత్త వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఇప్ప‌టికే నేష‌న‌ల్ డెమొక్ర‌టిక్ అల‌యెన్స్ (ఎన్డీయే) నుంచి త‌ప్పుకుంది అకాలీద‌ళ్‌. తాజాగా మ‌రో మిత్ర ప‌క్షం కూడా అదే హెచ్చ‌రిక జారీ చేసింది. మోదీ స‌ర్కార్ తెచ్చిన మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌క‌పోతే ఎన్డీయే నుంచి వైదొలుగుతామ‌ని అన్నారు రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) చీఫ్‌, రాజ‌స్థాన్ ఎంపీ హ‌నుమాన్ బేనివాల్‌. అంతేకాదు ఆందోళ‌న చేస్తున్న రైతుల‌తో డిసెంబ‌ర్ 3న కాకుండా వెంట‌నే చర్చ‌లు జ‌ర‌పాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫారసుల‌ను కూడా వెంట‌నే అమ‌లు చేయాల‌ని కూడా బేనివాల్ మోదీ స‌ర్కార్‌కు అల్టిమేటం జారీ చేశారు. రైతులే త‌మ పార్టీకి అతిపెద్ద మ‌ద్ద‌తుదారుల‌ని ఆర్ఎల్పీ చెబుతూ ఉంటుంది. ఈ విష‌యంలో త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోక‌పోతే రైతుల ప్ర‌యోజ‌నాల కోసం తాను ఎన్డీయే నుంచి త‌ప్పుకోవ‌డానికి ఏమాత్రం ఆలోచ‌న చేయ‌బోన‌ని బేనివాల్ స్ప‌ష్టం చేశారు. ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ సెప్టెంబ‌ర్‌లోనే శిరోమ‌ణి అకాలీద‌ళ్ ఎన్డీయే నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. రైతుల‌ను అణ‌చివేసే చ‌ర్య‌ల‌ను కూడా ఎవ‌రూ చేప‌ట్ట‌కూడ‌ద‌ని, అదే జ‌రిగితే ధ‌ర్నాలు చేస్తామ‌ని బేనివాల్ హెచ్చ‌రించారు. 


logo