బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 16:52:34

క‌ర్నాట‌క‌లో ల‌వ్ జిహాద్‌ను అంతం చేస్తాం: సీఎం య‌డ్యూర‌ప్ప‌

క‌ర్నాట‌క‌లో ల‌వ్ జిహాద్‌ను అంతం చేస్తాం:  సీఎం య‌డ్యూర‌ప్ప‌

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క రాష్ట్రంలో ల‌వ్ జిహాద్‌ను అంతం చేయనున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం య‌డ్యూర‌ప్ప అన్నారు. ల‌వ్ జిహాద్‌ను రూపుమాపేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. డ‌బ్బు, ప్రేమ పేరుతో అమ్మాయిల‌ను మోసం చేసే ప‌ద్ధతుల్ని అడ్డుకుంటామ‌న్నారు. ల‌వ్ జిహాద్ ఓ సామాజిక రుగ్మ‌త అని, దాన్ని రూపుమాపేందుకు ఓ చ‌ట్టాన్ని తేవాల‌ని చూస్తున్న‌ట్లు హోంమంత్రి బ‌స‌వ‌రాజ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ల‌వ్ జిహాద్ పేరుతో రాష్ట్రంలో జ‌రుగుతున్న మ‌త మార్పుడ‌ల గురించి మీడియాలో అనేక క‌థ‌నాల‌ను చూశామ‌ని,  దీని గురించి అధికారుల‌తో చ‌ర్చిచామ‌ని, ఇత‌ర రాష్ట్రాల‌కు గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, కానీ క‌ర్నాట‌క‌లో మాత్రం ల‌వ్ జిహాద్‌ను అంతం చేస్తామ‌ని సీఎం య‌డ్డీ తెలిపారు.