సోమవారం 30 నవంబర్ 2020
National - Sep 24, 2020 , 15:00:38

అక్టోబ‌ర్ 10లోపు సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు

అక్టోబ‌ర్ 10లోపు సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు

ఢిల్లీ : ప‌న్నెండ‌వ త‌ర‌గ‌తి కంపార్ట్‌మెంట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను అక్టోబ‌ర్ 10వ తేదీ కానీ లేదా ఆలోపుగానీ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు సీబీఎస్ఈ నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) సైతం అక్టోబర్ 31 నుండి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం అకాడెమిక్ క్యాలెండర్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు జస్టిస్ ఎ ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు తెలిపింది. 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల విద్యాసంవత్సరం వృథా కాకుండా చూసుకుంటామ‌ని సీబీఎస్ఈ, యుజీసీ పేర్కొన్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి నేప‌థ్యంలో విద్యార్థులకు సహాయం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స‌ర్వోన్న‌త న్యాయస్థానం పేర్కొంది.