ఆదివారం 17 జనవరి 2021
National - Jan 14, 2021 , 22:40:28

పెద్ద ఆశ‌లేం లేవు.. 9వ విడుత చ‌ర్చ‌ల‌పై రైతు నేత‌లు

పెద్ద ఆశ‌లేం లేవు.. 9వ విడుత చ‌ర్చ‌ల‌పై రైతు నేత‌లు

న్యూఢిల్లీ: ‌వివాదాస్ప‌ద కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు విష‌య‌మై శుక్ర‌వారం జ‌రిగే తొమ్మిదో విడుత చ‌ర్చ‌ల్లో చెప్పుకోద‌గిన పురోగ‌తి ఉంటుంద‌ని త‌మ‌కు ఆశ‌లు లేవ‌ని రైతు సంఘాల నేత‌లు చెప్పారు. ఈ అంశంపై కేంద్రంతో జ‌రిగే చ‌ర్చ‌లు చివ‌రివ‌ని సంకేతాలందుతున్నాయి. 

కేంద్ర చ‌ట్టాల‌ను ప‌రిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ తొలి స‌మావేశం ఈ నెల 19న జ‌రుగ‌నుండ‌టం గ‌మ‌నార్హం. భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (ఏక్తా ఉగ్ర‌హ‌న్‌) నేత జోగింద‌ర్ సింగ్ ఉగ్ర‌హ‌న్ గురువారం పీటీఐతో మాట్లాడుతూ.. శుక్ర‌వారం జ‌రిగే చ‌ర్చ‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై సుప్రీంకోర్టు నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసిన సంగ‌తిని గుర్తు చేస్తుంద‌న్నారు.

రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వానికి మంచి ఆలోచ‌నే లేద‌ని జోగింద‌ర్ సింగ్ ఉగ్ర‌హాన్ చెప్పారు. తాము ఎటువంటి క‌మిటీల‌ను కోరుకోవ‌డం లేద‌న్నారు. తాము కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేయ‌డంతోపాటు తాము పండించే పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. త‌మ డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కు రైతులు ఆందోళ‌న విర‌మించ‌బోర‌ని స్ప‌ష్టం చేశారు. 

మ‌రో రైతు నేత అభిమ‌న్యు కోహ‌ర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌బోద‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి తెలుసున‌ని చెప్పారు. ప్ర‌భుత్వం రైతుల మ‌నోభావాల‌తో ఆట‌లాడుకోవ‌డం మానుకోవాల‌ని సూచించారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 28వ తేదీ నుంచి వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఆందోళ‌న చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు నియ‌మించిన క‌మిటీ నుంచి భార‌తీయ కిసాన్ యూనియ‌న్ అధ్య‌క్షుడు భూపింద‌ర్ సింగ్ మాన్ వైదొలిగారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.