గురువారం 28 జనవరి 2021
National - Sep 04, 2020 , 11:05:48

పార్లమెంటులో ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాం : కేంద్రం

పార్లమెంటులో ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తాం : కేంద్రం

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. కరోనా నేపథ్యంలో జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయటంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ వర్గాలు ఈ మేరకు వివరణ ఇచ్చాయి. గతంలోనూ ప్రశ్నోత్తరాల సమయాన్ని వివిధ కారణాలతో రద్దు చేశారని గుర్తుచేశాయి. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నా వివిధ ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడం సబబేనని సర్కార్ సమర్థించుకున్నది. ప్రజల ‘ప్రాణాలతోపాటు జీవన కార్యకలాపాలు కూడా ముఖ్యమే’ అని పేర్కొంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo