గురువారం 21 జనవరి 2021
National - Dec 01, 2020 , 01:36:45

వీలైనంత త్వరలో చెప్తా: రజినీ

వీలైనంత త్వరలో చెప్తా: రజినీ

చెన్నై: సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ఈ విషయంలో వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సోమవారం తన పార్టీ రజనీ మక్కళ్‌ మండ్రం (ఆర్‌ఎంఎం) జిల్లా కార్యదర్శులతో రజినీ సమావేశమై చర్చించారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. వాళ్ల (ఆర్‌ఎంఎం కార్యదర్శులు) అభిప్రాయాలను వాళ్లు చెప్పారని, తన అభిప్రాయాన్ని తాను తెలియజేశానని రజినీ తెలిపారు. ‘నా నిర్ణయం ఏదైనా సరే నా వెంటే ఉంటానని వాళ్లు చెప్పారు. నా నిర్ణయాన్ని వీలైనంత త్వరగా వెల్లడిస్తాన’ని చెప్పారు. 


logo