ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 17:50:59

ఎంతో సౌక‌ర్యంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండే మాస్కుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైల్డ్‌క్రాఫ్ట్‌!

ఎంతో సౌక‌ర్యంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండే మాస్కుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైల్డ్‌క్రాఫ్ట్‌!

క‌రోనా నేప‌థ్యంలో మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా మారాయి. మాస్క్ లేక‌పోతే ఫైన్ క‌ట్టాల్సి వ‌స్తుంది అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌రోనా బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అందుక‌ని ప్ర‌తిఒక్క‌రూ మాస్కులు వాడుతున్నారు. కాక‌పోతే కొన్ని మాస్కులు స‌రిగా లేనందున‌ మూతి భాగంలో మ‌చ్చ‌లు ప‌డ‌డం, గాలి బ‌య‌ట‌కు వెళ్ల‌డం వ‌ల‌న వైర‌స్‌కు గుర‌వుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ మ‌న‌సులో పెట్టుకొని అంద‌రికీ అనుకూలంగా ఉప‌యోగ‌ప‌డేలా వైల్డ్‌క్రాఫ్ట్ సంస్థ‌ మాస్కుల‌ను త‌యారు చేస్తున్న‌ది.

సాహ‌స‌యాత్ర‌లు, క్రీడారంగాల‌కు సంబంధించిన దుస్తులు త‌యారు చేసే ఈ సంస్థ ఇప్పుడు మాస్కులు త‌యారు చేసే ప‌నిలో ప‌డింది. భార‌త్‌లో త‌యారీ స్ఫూర్తిగా ఈ సూప‌ర్‌మాస్క్ డ‌బ్ల్యూ 95ని ఆవిష్క‌రిస్తున్న‌ట్లు వైల్డ్‌క్రాఫ్ట్ స‌హా వ్య‌వ‌స్థాప‌కులు గౌర‌వ్ డ‌బ్లిష్‌, సిద్ధార్థ్ సూద్‌లు తెలిపారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి మాస్కులు త‌యారు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఫ్యాష‌న్‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా మాస్కు‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటూ వాష్ చేసుకొని వాడుకోవ‌డం ఈ మాస్కు‌ల ప్ర‌త్యేక‌త‌. వీటి ధ‌ర కేవ‌లం రూ. 200 ఉంటుంద‌ని వెల్లడించారు. 


logo