బుధవారం 02 డిసెంబర్ 2020
National - Aug 21, 2020 , 18:16:10

గుడిసెపై విరుచుపడిన అటవీ ఏనుగుల మంద

గుడిసెపై విరుచుపడిన అటవీ ఏనుగుల మంద

బలరాంపూర్‌ : అటవీ ఏనుగుల మంద ఒక్కసారిగా ఇంటిపై పడితే ఎలా ఉంటుంది.! ధైర్యం చేసి నిలువరించే ఆలోచన అటుంచి బతికి బయటపడితే చాలనుకొని పారిపోవడమే తరువాయి. శుక్రవారం సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.. ఛత్తీస్‌ఘ‌ఢ్‌ రాష్ట్రంలోని బలరాంపూర్‌ జిల్లా రఘునాథ్ నగర్లో. గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో ఓ రైతు భూమిని సాగు చేసుకుంటూ అక్కడే గుడిసె వేసుకొని కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఉన్నట్టుండి అడవి ఏనుగుల మంద గుడిసెపై విరుచుపడడంతో అందరూ పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఏనుగులు గుడిసెను ధ్వంసం చేసి పంటను సర్వనాశనం చేసి వెళ్లిపోయాయి. గుడిసె ధ్వంసమైన వీడియో ప్రసుత్తం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.