సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 18:10:03

స్కూల్‌లో ఏనుగు వీరంగం..

స్కూల్‌లో ఏనుగు వీరంగం..

తమిళనాడు : ఉదగమండలంలోని స్కూల్‌లో ఓ గజరాజం వీరంగం సృష్టించింది. నీలగిరి జిల్లా ముదుమలై టైగర్‌ రిజర్వ్‌లో నుంచి ఓ ఏనుగు సమీపంలోని మావనల్లా ప్రాంతంలో  ఓ స్కూల్‌ గేట్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించింది. స్కూల్‌ ప్రహరి గోడను ధ్వంసం చేసింది. ఏనుగు హల్‌చల్‌తో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. స్కూల్‌ టీచర్లు విద్యార్థులతోపాటు సమీప గ్రామస్తులను అప్రమత్తం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు డ్రమ్ములు కొడుతూ, ఫైరింగ్‌ చేస్తూ ఏనుగును అడవిలోకి తరిమేశారు. logo