శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 06:40:42

భర్త కోసం నాలుగు రోజులు అడవిని జల్లెడ పట్టింది

భర్త కోసం నాలుగు రోజులు అడవిని జల్లెడ పట్టింది

బిజాపు: మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను కాపాడేందుకు ఓ మహిళ నాలుగు రోజులపాటు అడవిని జల్లెడ పట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని భోపాలపట్నం స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంతోష్‌ కాట్టమ్‌ను ఈ నెల 6న మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. దీంతో ఆయన భార్య సునీత తన భర్తను కాపాడేందుకు 14 ఏండ్ల కూతురు, కొందరు స్థానికులు, ఓ జర్నలిస్టుతో కలిసి అడవిలోకి వెళ్లింది. నాలుగు రోజుల తర్వాత వారికి మావోయిస్టుల బృందం కనిపించింది. సునీత పట్టుదల, స్థానికులు ఒత్తిడి తేవడంతో మావోయిస్టులు అతడిని విడిచిపెట్టారు. logo