సోమవారం 30 నవంబర్ 2020
National - Aug 17, 2020 , 13:31:53

మహిళ బ్లాక్‌మెయిల్ చేస్తున్నదంటూ బీజేపీ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు

మహిళ బ్లాక్‌మెయిల్ చేస్తున్నదంటూ బీజేపీ ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు

డెహ్రాడూన్: ఒక మహిళ రూ.5 కోట్లు ఇమ్మని తమను బ్లాక్‌మెయిల్ చేస్తున్నదని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి భార్య రీటా నేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెహ్రాడూన్ లోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ అధికారులు ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తామని లా అండ్ ఆర్డర్ డీజీ అశోక్ కుమార్ తెలిపారు.

కాగా, ఎమ్మెల్యే మహేష్ నేగి భార్య ఫిర్యాదుపై ఆ మహిళ స్పందించారు. ఆ ఎమ్మెల్యే తనపై గత రెండేండ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎమ్మెల్యే ద్వారా తనకు ఒక ఆడబిడ్డ పుట్టినట్లు ఆమె చెప్పారు. ఎమ్మెల్యే భార్య తనపై తప్పుడు ఫిర్యాదు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను ఆమె పోస్టు చేశారు. నిజం నిరూపితం కావాలంటే తన బిడ్డ, ఎమ్మెల్యేకు డీఎన్ఏ పరీక్షలు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.