శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 04, 2021 , 15:10:02

భ‌ర్త‌ను చంపి.. ఫేస్‌బుక్‌లో పోస్టు

భ‌ర్త‌ను చంపి.. ఫేస్‌బుక్‌లో పోస్టు

న్యూఢిల్లీ: 36 ఏళ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌ను క‌త్తితో పొడిచి చంపింది. ఈ విష‌యాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఆ త‌ర్వాత ఆత్మ‌హ‌త‌కు ఆమె ప్ర‌య‌త్నించింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని చ‌తార్‌పూర్‌లో జ‌రిగింది. ఢిల్లీ పోలీసులు ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు.  పొరుగింటి వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో అల‌ర్ట్ అయిన పోలీసులు అపార్ట్‌మెంట్ డోర్ ఓపెన్ చేశారు.  ఫేస్‌బుక్‌లో ఆ మ‌హిళ పెట్టిన పోస్టును చూసిన పక్కింటివారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్ డోర్‌ను లోప‌లి నుంచి లాక్ చేశారని, ఫ్లోర్ నిండా ర‌క్తం నిండిపోయింద‌ని, గోడ‌ల‌కు కూడా రక్తం చ‌ల్లార‌ని పోలీసులు చెప్పారు. 37 ఏళ్ల వ్యక్తి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌గా, ఆ ప‌క్క‌నే స్పృహ కోల్పోయిన అత‌ని భార్య ఉన్న‌ద‌ని, ఆమెకు ప్ర‌స్తుతం ఎయిమ్స్ హాస్పిట‌ల్‌లో చికిత్స అందిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.  చ‌తార్‌పూర్ అపార్ట్‌మెంట్‌లో 2013 నుంచి ఆ జంట నివ‌సిస్తున్న‌ది. వారిది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జెయిన్‌. ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆ ఇద్ద‌రూ ఉద్యోగం చేస్తున్నారు. వారికి పిల్ల‌లు లేరు. అయితే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య కొన్నాళ్లుగా విబేధాలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.  


logo