సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 15:10:39

రాజమండ్రిలో కాలిన శవాలు..హత్యా?..ఆత్మహత్యా?..

రాజమండ్రిలో కాలిన శవాలు..హత్యా?..ఆత్మహత్యా?..

రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంటికి సమీపంలోని తుప్పల్లో కాలిపోయి భార్యభర్తల మృత దేహాలు ఉండటం కలకలం రేగింది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. వీరు స్థానికులా? లేక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కరోనా వచ్చిందన్న అనుమానంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సూసైడ్ నోట్‌లో రాసి ఉండటాన్ని బట్టి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వీరిని చంపేసి, కిరోసిన్ పోసి కాల్చేసి.. సూసైడ్ నోట్ రాసిపెట్టారా? లేక వాళ్లే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో విచారణ చేపట్టారు. కరోనా వచ్చినందుకే ఆత్మహత్య చేసుకుంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


logo