శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 10:48:31

పేద‌ల ప్రాణాలంటే ఎందుకంత చుల‌క‌న‌: అఖిలేష్ యాద‌వ్

పేద‌ల ప్రాణాలంటే ఎందుకంత చుల‌క‌న‌: అఖిలేష్ యాద‌వ్

ల‌క్నో: నిరుపేద‌లు, వ‌ల‌స కూలీల ప్రాణాలంటే కేంద్ర ప్ర‌భుత్వానికి ఎందుకంత చుల‌క‌న అని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. గురువారం ఉద‌యం ముజ‌ఫ‌ర్‌పూర్-ష‌హ‌రాన్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు వ‌ల‌స కూలీలు మృతిచెందిన ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేస్తూ అఖిలేష్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

'విదేశాల్లో ఉన్న సంప‌న్నుల‌ను వందేభార‌త్ మిష‌న్ పేరుతో విమానాల ద్వారా భార‌త్‌కు త‌ర‌లిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న నిరుపేద వ‌ల‌స‌కూలీలను మాత్రం రైలు చార్జీలు వ‌సూలు చేసి రైళ్ల‌లో త‌ర‌లిస్తున్నారు. చార్జీలు చెల్లించ‌లేని వారు కాలిన‌డ‌క‌న వెళ్తూ ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌ల రైలు ప్ర‌మాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు బ‌స్సు ప్ర‌మాదంలో ఆరుగురు చ‌నిపోయారు. పేద కూలీల‌ను కూడా సురక్షితంగా స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌వ‌చ్చు క‌దా! పేద‌ల ప్రాణాలంటే ప్ర‌భుత్వాల‌కు ఎందుకంత చుల‌క‌న?'  అని అఖిలేష్ యాదవ్ ప్ర‌శ్నించారు.     


logo