సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 11:37:37

ప్ర‌ధాని ఎందుకు అబ‌ద్ధం చెబుతున్నారు: రాహుల్ గాంధీ

ప్ర‌ధాని ఎందుకు అబ‌ద్ధం చెబుతున్నారు:  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌: చైనాతో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డ్డ అంశంపై మ‌ళ్లీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించారు.  జూన్ 15వ తేదీన జ‌రిగిన గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ క‌న్నా నెల రోజుల ముందే ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో చైనా ద‌ళాలు ప్ర‌వేశించిన‌ట్లు రాహుల్ తెలిపారు.  వాస్త‌వాధీన రేఖ వెంట చైనా ద‌ళాలు ఆక్ర‌మిస్తే,  ర‌క్ష‌ణ‌శాఖ మాత్రం ఆ నిజాన్ని దాచిన‌ట్లు రాహుల్ చెప్పారు. పెట్రోలింగ్ పాయింట్ 15 వ‌ద్ద ఉన్న కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో వ‌ద్ద మే నెల 17వ‌, 18వ తేదీల్లో చైనా ద‌ళాలు ముందుకు దూసుకువ‌చ్చిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ ఓ నివేదిక‌లో పేర్కొన్న‌ది. ఆ నివేదిక‌పై రాహుల్ స్పందించారు.  చైనా ద‌ళాలు దూసుకువ‌చ్చిన అంశంపై ప్ర‌ధాని ఎందుకు అబద్ధం చెబుతున్నార‌ని రాహుల్ నిల‌దీశారు.   


logo