ఆదివారం 12 జూలై 2020
National - Jun 16, 2020 , 15:16:01

మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు బీమా ఎందుకివ్వ‌రు.. ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు

మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు బీమా ఎందుకివ్వ‌రు.. ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు

హైద‌రాబాద్‌: మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డేవారికి జీవిత బీమా ఎందుకు క‌ల్పించ‌ర‌ని ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది.  ఇన్సూరెన్స్ జారీ చేసే ఐఆర్‌డీఏఐ సంస్థ‌కు కూడా సుప్రీం నోటీసులు ఇచ్చింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో.. దేశవ్యాప్తంగా డిప్రెష‌న్ గురించి చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారికి కూడా ఆర్థిక సాయం చేయాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 

ఈ అంశాన్ని ప‌రిశీలించ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  మాన‌సిక ఆరోగ్యంగా స‌రిగా లేని వారికి జీవిత బీమా క‌ల్పించాల‌న్న అంశాన్ని విచారించ‌నున్న‌ట్లు కోర్టు చెప్పింది. మ‌రో రెండు వారాల్లోగా ఈ అంశాన్ని విచారించ‌నున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది.  త‌మ పాల‌సీల్లో.. మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు కూడా బీమా క‌ల్పించే అవ‌కాశాన్ని ప‌రిశీలించాని ఆయా కంపెనీల‌కు రెండేళ్ల క్రితం ఐఆర్‌డీఏఐ సూచ‌న‌లు చేసింది.  మెంట‌ల్ హెల్త్‌కేర్ యాక్ట్ 2017 ప్రకారం.. చికిత్స చేయాల‌ని సూచించింది.  ఈ చ‌ట్టం 2018 మే నెల‌లో అమ‌లులోకి వ‌చ్చింది. శారీర‌క స‌మ‌స్య‌ల‌కు ఎటువంటి చికిత్స అందిస్తారో అలాగే మానసిక రుగ్మ‌త‌ల‌కు కూడా చికిత్స ఇవ్వాల‌ని మెంట‌ల్ హెల్త్‌కేర్ యాక్ట్‌లో పేర్కొన్నారు. 


logo