శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 16:31:44

ఆమెను ఇప్పుడు ఎవ‌రూ న‌మ్మ‌రు: ప‌ంజాబ్ సీఎం

ఆమెను ఇప్పుడు ఎవ‌రూ న‌మ్మ‌రు: ప‌ంజాబ్ సీఎం

అమృత్‌స‌ర్‌: ‌త‌న రాజీనామా వెనుక ఎలాంటి స్వార్థ ప్ర‌యోజ‌నాలు లేవ‌ని, రైతుల ప‌క్షాన నిల‌బ‌డేందుకే తాను ప‌ద‌విని త్య‌జించాన‌ని కేంద్ర మాజీ మంత్రి హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ఖండించారు. రాజీనామా ద్వారా న‌ష్ట‌పోయానే త‌ప్ప ఏ విధ‌మైన ల‌బ్ధి పొంద‌లేద‌నే ఆమె వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని అమ‌రీంద‌ర్ వ్యాఖ్యానించారు. 

సాధార‌ణంగా ఏ బిల్లు అయినా క్యాబినెట్ ఆమోదం పొందిన త‌ర్వాత‌నే స‌భ ముందుకు వ‌స్తుంద‌ని, వ్య‌వ‌సాయ బిల్లులకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రిమండ‌లిలో ఒక మంత్రిగా ఉన్న హ‌ర్‌సిమ్ర‌త్ అప్పుడే ఆ బిల్లుల‌ను ఎందుకు వ్య‌తిరేకించ‌లేద‌ని పంజాబ్ సీఎం ప్ర‌శ్నించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డం కోసమే శిరోమ‌ణి అకాలీద‌ళ్.. రైతులకు అన్యాయం పేరుచెప్పి హ‌ర్‌సిమ్ర‌త్‌తో రాజీనామా చేయించింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్పుడు హ‌ర్‌సిమ్ర‌త్ చెప్పే మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని ఆయ‌న పేర్కొన్నారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo