సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 13:54:33

ఆ ట్వీట్ల‌ను ఎందుకు తొల‌గించ‌లేరు.. ట్విట్ట‌ర్‌ను ప్ర‌శ్నించిన సుప్రీం

ఆ ట్వీట్ల‌ను ఎందుకు తొల‌గించ‌లేరు.. ట్విట్ట‌ర్‌ను ప్ర‌శ్నించిన సుప్రీం

హైద‌రాబాద్‌: న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ చేసిన వివాదాద‌స్ప ట్వీట్ల‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఆ ట్వీట్ల‌ను మీరెందుకు తొల‌గించ‌లేర‌ని ట్విట్ట‌ర్ సంస్థ‌ను సుప్రీం నిల‌దీసింది. ఇప్ప‌టికే ఈ కేసులో కోర్టు ధిక్క‌ర‌ణ కింద నోటీసులు ఇచ్చారు. జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాసం ఇవాళ ఈ కేసును విచారించింది. మీరెందుకు ట్వీట్ల‌ను తొల‌గించ‌లేరు, కోర్టు ధిక్క‌ర‌ణ విచార‌ణ చేప‌ట్టినా ఎందుకు స్పందించ‌డంలేదు, మీరేదైనా అధికారిక ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారా, ఈ కేసులో మేం ఎటువంటి ఆదేశాల‌ను పాస్ చేయం, మీ విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌ని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.  ట్విట్ట‌ర్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది స‌జ‌న్ పొవ్వాయా వాదించారు. అయితే కోర్టు చెప్పిన విష‌యాల‌ను త‌న క్ల‌యింట్‌కు వివ‌రించ‌నున్న‌ట్లు న్యాయ‌వాది పొవ్వాయా తెలిపారు. 

ఆగ‌స్టు 5వ తేదీలోగా త‌న ట్వీట్ల‌కు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు.. న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వ‌చ్చే విచార‌ణ‌లో అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వేణుగోపాల్ కూడా హాజ‌రుకావాల‌ని సూచించింది. జూన్ 27, 29 తేదీల్లో ప్ర‌శాంత్ వివాదాస్ప‌ద ట్వీట్లు పోస్టు చేశారు. లాక్‌డౌన్‌తో న్యాయ‌స్థానాన్ని సీజ్ చేసిన సీజేఐ.. నాగ‌పూర్‌లో 50 ల‌క్ష‌ల ఖ‌రీదైన మోట‌ర్‌సైకిల్ రైడ్ చేశార‌ని ఓ ట్వీట్‌లో ఆరోపించారు.  ఎటువంటి ఎమ‌ర్జెన్సీ లేకుండానే ఆరేళ్ల‌లో ప్ర‌జాస్వామ్యం ధ్వంస‌మైంద‌ని, గ‌త న‌లుగురు సీజేఐల పాత్ర‌ను కూడా సంశ‌యిస్తున్న‌ట్లు ప్ర‌శాంత మ‌రో వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు. logo