సోమవారం 06 జూలై 2020
National - Jun 18, 2020 , 13:27:43

ఆయుధాలు లేకుండా సైనికులను ఎవరు పంపారు?.. ఎందుకు పంపారు?

ఆయుధాలు లేకుండా సైనికులను ఎవరు పంపారు?.. ఎందుకు పంపారు?

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తలపడిన భారత సైనికులను ఆయుధాలు లేకుండా ఎవరు పంపారు?.. ఎందుకు పంపారు? అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడంపై గురువారం ఆయన మాట్లాడారు. ఆయుధాలు లేని సైనికులను చంపి చైనా ఘోర నేరానికి పాల్పడిందని ఆరోపించారు. ‘భారత సైనికులను ఆయుధాలు లేకుండా ఎవరు పంపారు.. ఎందుకు పంపారన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దీనికి బాధ్యులెవరు?’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.  logo