గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 01, 2020 , 15:45:16

బీజేపీని ఓడించలేమని ఎవరన్నారు.? : చిదంబరం

బీజేపీని ఓడించలేమని ఎవరన్నారు.? : చిదంబరం

న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయని, ఎన్నికల ఫలితాల్లో ఇదే స్పష్టం కాబోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు. 2019 లోక్‌సభ తరువాత దేశంలో బీజేపీ చరిష్మా క్రమంగా తగ్గుతోందని అన్నారు. 2019 నుంచి వివిధ రాష్ట్రాల్లోని 381 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కేవలం 163 స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని చిదంబరం స్పష్టంచేశారు.

బీజేపీని ఓడించలేమని ఎవరన్నారని, ఆ పార్టీని చిత్తు చేయగలమని విపక్షాలు విశ్వసిస్తున్నాయని అన్నారు. బీహార్‌ ఎన్నికలతో ఇది నిరూపితమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) నాయకత్వంతో మహాకూటమిగా బీజేపీ, జేడీయూ కూటమిని ఢీకొడుతున్న సంగతి తెలిసిందే. తొలిదశ పోలింగ్‌ గత నెల 28న ముగియగా.. ఈ నెల 3న రెండో విడుత, 7న మూడో విడుత పోలింగ్‌ జరుగనుంది. 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.