శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 25, 2020 , 22:49:14

కొవిడ్‌ డబ్ల్యూహెచ్‌వో మొబైల్‌ యాప్ ఆవిష్కరణ‌.. అయితే?!

కొవిడ్‌ డబ్ల్యూహెచ్‌వో మొబైల్‌ యాప్ ఆవిష్కరణ‌.. అయితే?!

న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళిని వణికిస్తున్న విశ్వమారి ‘కరోనా’ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒక మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ‘డబ్ల్యూటీవో కొవిడ్‌-19 అప్‌డేట్‌’ పేరుతో దీన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆరోగ్య నిపుణుల నుంచి వైరస్‌కు సంబంధించిన విశ్వసనీయ సమాచారం లభ్యం అవుతుంది. కానీ ఇందులో కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి ఫీచర్ లేదు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కరోనా వైరస్ యాప్‌ను తెచ్చినా ఇది ప్రజల లభ్యత కోసం కాదు కాబట్టి యాప్ స్టోర్లు దీనిని తొలగించాయి.

ఇందులో ఎప్పటికప్పుడు స్థానిక ‘కొవిడ్‌-19’ సమాచారం, అప్‌డేట్స్‌తో కూడిన రియల్‌ టైం నోటిఫికేషన్స్‌ జారీ అవుతుంటాయి. స్థానిక సమాచారం మొదలు జాతీయ, అంతర్జాతీయ కరోనా కేసుల వివరాలు ఈ యాప్‌ ‘హోమ్‌’ స్క్రీన్‌ మీద డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. దీంతోపాటు పరిశుభ్రంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్దతుల సమాచారం కూడా చూసుకోవచ్చు. కొవిడ్‌-19 రెస్పాన్స్‌ ఫండ్‌ కోసం విరాళాలు ఇవ్వాలనుకునేవారికి లింక్‌ అందుబాటులో ఉంటుంది. 

డబ్ల్యూహెచ్‌వో కొవిడ్‌-19 అప్డేట్స్‌ యాప్‌.. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌ల్లోనూ లభిస్తుంది. సదరు స్మార్ట్‌ ఫోన్‌లో కనీసం ఆండ్రాయిడ్‌ 4.4, ఐవోఎస్‌ 9.0 వర్షన్‌ జత చేసి ఉండాలి. ఈ యాప్‌ను ప్రారంభంలో నైజీరియా కోసం డబ్ల్యూహెచ్‌వో అభివృద్ధి చేసింది. ఇది త్వరలో ప్రపంచ దేశాల ప్రజలకు అందుబాటులోకి రానున్నది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo