శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 18:15:39

హెచ్‌సీక్యూ, హెచ్ఐవీ మందులపై ప్ర‌యోగాలు నిలిపివేత : డ‌బ్ల్యూహెచ్‌వో

హెచ్‌సీక్యూ, హెచ్ఐవీ మందులపై ప్ర‌యోగాలు నిలిపివేత : డ‌బ్ల్యూహెచ్‌వో

జెనీవా : క‌రోనా వైర‌స్ చికిత్స‌లో యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌, హెచ్ఐవీ మందులు లోపినావిర్‌/రిటోనవీర్‌తో చేస్తున్న ప్ర‌యోగాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ అరిక‌ట్ట‌డంలో ఈ డ్ర‌గ్స్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ఆధ్వ‌ర్యంలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, ఇటీవ‌ల ప్ర‌యోగాల‌కు సంబంధించిన ఫ‌లితాల్లో ఔష‌ధాల ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌ని పేర్కొన్న‌ది. ఆసుపత్రిలో చేరిన కోవిడ్-19 రోగుల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్‌, లోపినావిర్/రిటోనవిర్ ఔష‌ధాలు కొంద‌రిలో త‌క్కువ‌గా, మ‌రికొంద‌రిలో మొత్తానికే ప్ర‌భావం చూప‌లేద‌ని ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో మ‌ర‌ణాల రేటును తగ్గించ‌డంలో ఏమాత్రం స‌ఫ‌లం కాలేద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో అధ్య‌య‌నాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించింది.  కాగా, ద‌వాఖాన‌లో చేర‌ని వారిపై, వైర‌స్ ముప్పును త‌ప్పించుకునేందుకు  ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హెచ్‌సీక్యూ ఉప‌యోగించ‌వ‌చ్చో.. లేదో.. ప‌రీక్షించేందుకు జ‌రుగుతున్న ప్ర‌యోగాల‌పై ఈ నిర్ణ‌యం ఎలాంటి ప్ర‌భావం చూప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. 


logo