జెనీవా: కకరోనా నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అందులో 60 శాతం మూడు దేశాలే ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. అవి అమెరికా, భారత్, చైనా అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
212 దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైతే, అందులో 10 దేశాలే 75 శాతం వ్యాక్సిన్లను పొందాయని డబ్ల్యూహెచ్‌వో డీజీ టెడ్రోస్ అథానోమ్ సీనియర్ సలహాదారు బ్రూస్ ఐల్వల్డ్ అన్నారు. 127 దేశాలకు వ్యాక్సిన్ల సరఫరాలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కీలక పాత్ర పోషించిందన్నారు.
చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి కొవాగ్జిన్ దోహదపడిందని బ్రూస్ ఐల్వల్డ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం జనాభా కల తక్కువ ఆదాయ దేశాలకు కేవలం 0.5 % టీకాలు మాత్రమే పంపిణీ జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
మధ్యాదాయ దేశాల పరిస్థితీ పేద దేశాలతో పోలిస్తే అంత మెరుగ్గా ఏమీ లేదని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయ పడింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ తమ దృష్టిలో అంత ప్రాధాన్యం కాదని శుక్రవారం వెల్లడించింది.
చిన్నారులపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రాణాంతకం కూడా కాదన్నది.
పిల్లలను పాఠశాలలకు పంపేముందు వ్యాక్సినేట్ చేయడం కూడా అత్యవసరమేమీ కాదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పాఠశాలల్లో విద్యార్థులను చూసుకునే సిబ్బందికి, ఉపాధ్యాయ సిబ్బందికి టీకాలు ఇస్తే మేలని తెలిపింది.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్‌లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్‌గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?