బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 14:07:26

స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారు క్వారంటైన్‌కు వెళ్లండి..

స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారు క్వారంటైన్‌కు వెళ్లండి..

హైద‌రాబాద్‌: కోజికోడ్‌లో జ‌రిగిన‌ విమాన ప్ర‌మాద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారు క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం సూచించింది. విమాన ప్ర‌మాదంలో మృతిచెందిన‌వారిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, దీంతో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారు స్వీయ నిర్బంధంలో ఉండాల‌ని కోరింది. మిగ‌తా ప్ర‌యాణికుల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని ఆరోగ్య‌శాఖ‌ ప్ర‌క‌టించింది. 

కాగా, విమాన ప్ర‌మాద  సహాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న స్థానికులు క్వారంటైన్‌కు వెళ్లాల‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ ఇప్ప‌టికే సూచించారు. అదేవిధంగా ప్ర‌యాణికుల్లో క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌వారిని ర‌క్షించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎవ‌రనే విష‌యాన్ని గుర్తించేప‌నిలో ఉన్నామ‌ని సీఐఎస్ఎఫ్ ప్ర‌త్యేక డీజీ (ఎయిర్‌పోర్టులు) మంగ‌ప‌తి ప్రక‌టించారు. ‌

నిన్న సాయంత్రం కోజికోడ్ విమాన‌శ్ర‌యంలో దుబాయ్ నుంచి వ‌చ్చిన ఎయిర్ ఇండియా విమానం ర‌న్‌వేపై జారిప‌డిపోయింది. దీంతో విమానం రెండు ముక్క‌లు అయ్యింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు పైల‌ట్లు సహా 20 మంది మ‌ర‌ణించారు. క్ష‌త‌గాత్రుల‌ను ర‌క్షించ‌డానికి స్థానికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, వ‌లంటీర్లు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది పాలుపంచుకున్నారు.  ‌  


logo