బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 13:09:36

టాప్ 50 డిఫాల్ట‌ర్లు ఎవ‌రో చెప్పండి: రాహుల్ గాంధీ

టాప్ 50 డిఫాల్ట‌ర్లు ఎవ‌రో చెప్పండి:  రాహుల్ గాంధీ

హైద‌రాబాద్‌:  దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ విఫ‌ల‌మైంద‌ని రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. ఇవాళ లోక్‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.  భార‌త్‌లో ఉద్దేశ‌పూర్వ‌కంగా బ్యాంకు రుణాల‌ను ఎగ‌వేసిన 50 మంది వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌న్నారు. అవి విఫ‌ల‌మైన‌ట్లు రాహుల్ చెప్పారు.  భ‌విష్య‌త్తులో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ మ‌రింత దిగ‌జారే అవ‌కాశం ఉంద‌న్నారు.  అయితే తాను వేసిన ప్ర‌శ్న‌పై ప్ర‌ధాని మోదీ నుంచి ఎటువంటి స‌మాధానం రాలేద‌న్నారు. ఇదే అంశంపై స‌ప్ల‌మెంట‌రీ ప్ర‌శ్న వేయ‌డానికి కూడా స్పీక‌ర్ అనుమ‌తించ‌లేద‌ని, ఇది త‌న‌ను ఆవేద‌న‌కు గురి చేసింద‌ని రాహుల్ అన్నారు. పార్ల‌మెంట్ స‌భ్యుడు హ‌క్కును స్పీక‌ర్ అగౌర‌వప‌రిచార‌న్నారు.  బ్యాంకు రుణాల డిఫాల్ట‌ర్ల అంశంపై కేంద్ర ఆర్థిక స‌హాయ‌మంత్రి థాకూర్ స్పందించారు.  ప్ర‌భుత్వ‌ వెబ్‌సైట్‌లో ఉద్దేశ‌పూర్వ‌క డిఫాల్ట‌ర్ల జాబితా ఉంద‌న్నారు.  ఇందులో దాచిపెట్టే అంశం ఏదీ లేద‌న్నారు.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యంలో డ‌బ్బులు తీసుకున్న వారే డిఫాల్ట‌ర్ల‌న్నారు.  logo
>>>>>>