గురువారం 04 జూన్ 2020
National - Apr 11, 2020 , 00:44:05

మోదీని అనుసరిస్తున్న వైట్‌హౌస్‌ ట్విట్టర్‌!

మోదీని అనుసరిస్తున్న వైట్‌హౌస్‌ ట్విట్టర్‌!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అధికారిక నివాసం వైట్‌హౌస్‌ ట్విట్టర్‌ ఖాతా భారత ప్రధాని మోదీ, భారత ప్రధానమంత్రి కార్యాలయం, భారత రాష్ట్రపతి ట్విట్టర్‌ ఖాతాలను అనుసరిస్తున్నది. భారత దౌత్యవిజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. వైట్‌హౌస్‌ ట్విట్టర్‌ ఖాతా ఇప్పటివరకూ ప్రపంచంలో మరే దేశ ప్రభుత్వాన్నిగానీ, అధినేతనుగానీ అనుసరించలేదు. కేవలం 19 మంది ట్విట్టర్‌ ఖాతాలను మాత్రమే వైట్‌హౌస్‌ ఖాతా అనుసరిస్తుండగా అందులో 16 అమెరికాకు చెందినవారివి, మిగతా మూడు భారత్‌కు చెందినవి కావడం విశేషం.logo