మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 21:49:35

ఏ రంగు గుడ్లు బెటర్ తెల్లవా? గోధుమ రంగువా?

 ఏ రంగు గుడ్లు బెటర్  తెల్లవా? గోధుమ రంగువా?

హైదరాబాద్ : కోడి గుడ్లలో విటమిన్లు, మినరల్స్, మన శరీరానికి అవసరమైన అన్ని పోటీన్స్ ఉంటాయి. ప్రస్తుతం గుడ్లను... బేకింగ్ ఆహారంలో, సలాడ్లలో కూడా వాడుతున్నారు. కర్రీస్, నూడుల్స్, బ్రోత్స్‌తోపాటూ వండుతున్నారు. విడిగా కూడా తింటున్నారు. రోజూ రెండు గుడ్లను తింటే... ఆరోగ్యానికి ఎంతో మేలు.తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లను తింటే ఎక్కువ ఆరోగ్యకరం అని చాలా మంది అనుకుంటుంటారు. ఇందుకు ప్రధాన కారణం బ్రౌన్ ఎగ్స్ రేటు ఎక్కువ కావడమే. నిజానికి వాటి రేటు ఎక్కువైనప్పటికీ... అదనంగా కలిగే ప్రయోజనాలు ఏవీ ఉండవు. తెల్లటి గుడ్ల కంటే... బ్రౌన్ ఎగ్స్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది. నిజానికి అలాంటిదేమీ ఉండదు.

తెల్లటి గుడ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, బ్రౌన్ ఎగ్స్‌లో కూడా సేమ్ పోషకాలే ఉంటాయి. రెండు రకాల గుడ్లను పరిశోధించగా... పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. తేడా కేవలం వాటి రంగులో మాత్రమే అంటున్నారు పరిశోధకులు. టేస్ట్ విషయంలో నైతే... రుచి కొంచెం వేర్వేరుగానే ఉంటుంది. అంతమాత్రాన పోషకాల పరిమాణంలో మాత్రం తేడా ఉండదు.కేలరీలు, ప్రోటీన్స్, కొలెస్ట్రాల్ విషయంలో రెండు రకాల గుడ్లూ ఒకే లాంటివి. బ్రౌన్ ఎగ్స్‌లో మాత్రం ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద డిఫరెన్స్ కాదంటున్నారు. 100 గ్రాముల గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అవి తెల్లవైనా, గోధుమ గుడ్లైనా అంతే. బ్రౌన్ ఎగ్స్ రేటు చాలా ఎక్కువ.

ఎందుకంటే వాటి ఉత్పత్తి తక్కువ. అంతే తప్ప అదనపు ప్రత్యేకతలేవీ వాటిలో లేవు. కానీ బ్రౌన్ ఎగ్స్‌ ఆర్గానిక్ (సేంద్రియ) తరహాలో ఉత్పత్తి చేస్తారనీ, అందువల్ల వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయనే అపోహ ఉంది. గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్‌వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్లు పెట్టే కోళ్లు పెద్దవి అయితే... గుడ్లు పెద్దవిగా ఉంటాయి... కోళ్లు చిన్నవైతే... గుడ్లు కూడా చిన్నగా ఉంటాయి. వేసవి కాలంలో పెట్టే గుడ్లు చిన్నవిగా, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగా ఉంటాయి. అవి ఏ రంగువైనా ఇలాగే జరుగుతుంది.


logo