మీ ఫ్రెండ్ కు గిఫ్ట్ ఇస్తూ ఏమంటారు.. ఇలా మాత్రం అనకండి!

హైదరాబాద్ :మనం పెండ్లికో, ఫంక్షన్‌కో వెళ్లినప్పుడు సందర్భానుసారంగా ఎవరొకరికి గిఫ్ట్‌లు ఇస్తుంటాం. అయితే వాటిని ఇస్తున్నప్పుడు మనం సరదాగా ఏదో ఒకటి అనేస్తుంటాం. నేను ఇచ్చే గిఫ్ట్‌తో నీకు డబ్బులు మిగులుతాయి, నీకు నేను ఖర్చు తగ్గిస్తున్నా... లాంటి మాటలు అంటుంటాం. అయితే మనం సరదాగా అన్న ఈ మాటలు బహుమతి తీసుకున్న వ్యక్తికి చాలా చిరాకుగా, ఇబ్బందికరంగా అనిపిస్తాయట. మనం ఇచ్చే బహుమతి ఎలాంటిదైనా పర్లేదు.. అది ప్రేమతో ఇచ్చినట్లు తెలిస్తే చాలు, అంతేకానీ వాటిని డబ్బుతో ముడి పెట్టడం వల్ల అది తీసుకున్న వ్యక్తి ఒక్కసారిగా దాన్ని తీసుకునేందు కూడా ఇష్టపడకపోవచ్చు. నేను డబ్బు కోసం ఫంక్షన్ చేసుకునే వాడిలా కనిపిస్తున్నానా అనే ఫీలింగ్ అవతలి వ్యక్తిలో కలగచ్చు. ఇలాంటి సందర్భాలు బంధాన్ని దెబ్బతీసే ప్రమాదాలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దాదాపు 200మంది విద్యార్థులపై చేసిన ఓ రీసెర్చ్‌లో తేలిందేంటంటే.. స్టూడెంట్స్‌ను రెండు గ్రూపులుగా విడదీసి ఒక గ్రూపు వారికి గిఫ్ట్ కార్డుల మీద "నువ్వు చాలా రోజుల నుంచి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న విషయం నాకు తెలుసు, నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ నీకు కొంచెం డబ్బును ఆదా చేస్తుంది" అని రాయగా. మరో గ్రూపుకు చెందిన వారు "నువ్వు చాలా రోజుల నుంచి టైం లేక ఇబ్బంది పడుతున్న విషయం నాకు తెలుసు, నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ నీకు కాస్త సమయాన్ని ఆదా చేస్తుంది" అని రాశారు. అంటే డబ్బు స్థానంలో సమయాన్ని చేర్చారన్నమాట.
వీరిలో టైం గురించి రాసిన గిఫ్ట్‌లు తీసుకున్న వారు వాటిని చూసి సంతోషించగా.. డబ్బు గురించి రాసిన గిఫ్ట్‌లు తీసుకున్న వారు మాత్రం చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయినట్లు తేలిందట. గిఫ్ట్ ఇచ్చిన వారు తమని అవమానిస్తున్నట్లుగా ఫీల్ అయ్యారట. కాబట్టి మనం ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అని ఎంత ఆలోచిస్తామో.. అలాగే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఏం మాట్లాడాలో బాగా ఆలోచించి ఇస్తే మంచిదని సైంటిస్టు లు సలహా ఇస్తున్నారు.
-వ్యక్తిత్వాన్ని బట్టి బహుమతిని ఎంచుకొండి...
మనం గిఫ్ట్ కొనే ముందు మొదటగా ఆలోచించాల్సింది అవతల వ్యక్తి వ్యక్తిత్వం గురించి. అతనికి ఎలాంటిది నచ్చుతుంది, అతని అభిరుచులు ఏంటి అని. ఉదాహరణకు వారికి చదవడం బాగా ఇష్టమంటే వారికి బుక్ ప్రెజెంట్ చేయండి. లేదు ఇంట్లో బాగా అలంకరించుకునేందుకు మొగ్గు చూపుతారనుకుంటే అలాంటి వాటిని కొని ఇవ్వండి.
-మీ అభిప్రాయం చెప్పండి...
మీరు సెలక్ట్ చేసిన గిఫ్ట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటో అవతలి వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఆ గిఫ్ట్ సెలక్ట్ చేసినప్పుడు అది మీకు ఎందుకు నచ్చిందో.. అదే ఎందుకు తీసుకున్నారో వివరంగా చెప్పండి. అప్పుడు తీసుకున్నవారు మరింత సంతోషంగా ఫీల్ అవుతారు.
-ఉపయోగాలేంటో చెప్పండి...
మీరు ఇచ్చే గిఫ్ట్ వల్ల ఉపయోగాలేంటో చెప్పండి. ఇంట్లోకి లేదా ఆఫీస్ లోకి ఏదైనా తీసుకున్నారనుకొండి. అది మీకు ఫలానా పనికి బాగా ఉపయోగపడుతుంది. నేనూ ఇలాంటిదే వాడతాను అని చెప్పండి.
డబ్బు గురించి అస్సలు మాట్లాడకండి...
మీరు బహుమతి ఇస్తున్నప్పుడు తీసుకునే వారి దగ్గర మాట్లాడకూడనిది ముఖ్యంగా డబ్బు విషయంలో. అంతపెట్టి కొన్నా, ఇంతపెట్టి కొన్నాఅంటూ డబ్బు గురించి మాట్లాడటం వల్ల అవతల వారు అది తీసుకునేందుకు అవమానంగా, సిగ్గుగా ఫీల్ అవుతుంటారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి