బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 18:38:37

అమ్మాయిని చూసి చూపు తిప్పుకోలేక‌పోయాడు.. చేతిలోని పాలు మ‌ట్టిపాలు!

అమ్మాయిని చూసి చూపు తిప్పుకోలేక‌పోయాడు.. చేతిలోని పాలు మ‌ట్టిపాలు!

అమ్మాయి క‌నిపిస్తే.. అది మంచో చెడో తెలియ‌దు కాని పాపం ఇదిగో అబ్బాయిలు మాత్రం ఏదోక‌టి పోగొట్టుకుంటారు. లోప‌లి నుంచి బ‌య‌టికి వ‌స్తున్న అబ్బాయి ముందు ఒక అమ్మాయి వెళ్తున్న‌ది. అమ్మాయి బాగుండ‌డంతో అబ్బాయి, అమ్మాయిని చూస్తూ ముందుకు న‌డుస్తున్నాడు. చేతిలో పాల క్యాన్ కూడా ఉంది.

ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూసుకోక‌పోవడంతో అత‌ను నేరుగా వెళ్లి ఆ స్తంబానికి గుద్దుకున్నాడు. అంతే.. ఇంకేముంది కింద‌ప‌డేసరికి చేతిలోని క్యాన్ కింద ప‌డింది. పాల‌న్నీ నేల‌పాల‌య్యే స‌రికి అబ్బా.. అనుకుంటూ లేచి అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు. పాల‌న్నీ నేల‌మీద ఉన్నాయేంట‌ని అక్క‌డి వాళ్లంద‌రూ పాల‌ను చూస్తూ వెళ్తుండే స‌రికి అత‌నికి సిగ్గుపోయినంత ప‌నైంది.


logo