ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 13:27:54

ఆ బిల్లుతో 50 కోట్ల మంది కూలీల‌కు ల‌బ్ధి: ప‌్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌

ఆ బిల్లుతో 50 కోట్ల మంది కూలీల‌కు ల‌బ్ధి: ప‌్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌

న్యూఢిల్లీ: దేశంలోని కూలీలు ఏ హ‌క్కు కోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ హ‌క్కును స్వాతంత్ర్యం‌ వ‌చ్చిన 73 ఏండ్ల త‌ర్వాత ఇప్పుడు పొంద‌బోతున్నార‌ని కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించారు. కూలీల‌కు అన్ని ర‌కాల భ‌ద్ర‌త క‌ల్పించే బిల్లును కేంద్రప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని ఆయ‌న బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో పేర్కొన్నారు. ఆక్యుపేష‌నల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వ‌ర్కింగ్ కండిష‌న్స్ కోడ్‌, ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్ కోడ్ & కోడ్ ఆన్ సోష‌ల్ సెక్యూరిటీ బిల్లుపై మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

తాజా బిల్లు దేశంలోని 50 కోట్ల మంది కూలీలకు వేత‌న భ‌ద్ర‌త‌, సామాజిక భ‌ద్ర‌త‌, ఆరోగ్య భ‌ద్ర‌తల‌కు సంబంధించి భ‌రోసా ఇస్తుంద‌ని ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు. ఇంత‌టి కీల‌క‌మైన బిల్లు స‌భ ముందుకు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌న్నీ స‌భ‌కు హాజ‌రుకాక‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాలకు ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డంలేద‌ని, వారు ప్ర‌జ‌ల నుంచి దూరం జ‌రిగార‌ని ఎద్దేవా చేశారు. ‌  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo