మంగళవారం 07 జూలై 2020
National - Jun 15, 2020 , 14:56:48

వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు

వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు

అత్యంత ఆదరణ పొందిన వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ వినియోగదారులను ఉత్సాహపరుస్తుంటుంది. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌, సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌, క్లియరింగ్‌ చాట్‌ ఫీచర్లను తీసుకువచ్చింది. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకురానున్నది. అది ఏంటంటే.. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌తో ఒకేసారి వివిధ డివైస్‌లలో వాట్సాప్‌ లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వివిధ డివైస్‌ల నుంచి ఒకే సమయంలో చాట్‌ చేసే అవకాశం కూడా ఉంటుంది.

చాలామంది ఒక సిస్టమ్‌లో వాట్సాప్‌ లాగ్‌ఇన్‌ అయి ఉంటారు. తర్వాత మరొక డివైజ్‌లో లాగ్‌ఇన్‌ అవ్వాలంటే ముందుదాంట్లో లాగౌట్‌ అవ్వాల్సి ఉంటుంది. అందుకే చాట్‌ విండోస్‌లో సరికొత్త 'సెర్చ్‌ ఆప్షన్‌' తీసుకురాబోతున్నదని డబ్లూఏబేటాఇన్ఫో వెల్లడించినది. సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయబోతున్నామని తెలిపింది. ఈ అప్‌డేట్  రావడానికి కొంత సమయం పడుతుంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే వాట్సాప్‌ యూజర్లు పండుగ చేసుకుంటారు.


logo