గురువారం 04 జూన్ 2020
National - Apr 02, 2020 , 19:49:45

కరోనాపై పుకార్లు..అడ్మిన్‌, మెంబర్‌ అరెస్ట్‌

కరోనాపై పుకార్లు..అడ్మిన్‌, మెంబర్‌ అరెస్ట్‌

నోయిడా: కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి వాట్సాప్‌ గ్రూపుల్లో వదంతులు సృష్టిస్తోన్న అడ్మిన్‌తోపాటు వాట్సాప్‌ గ్రూప్‌లోని మరో వ్యక్తి యూపీ పోలీసులు అరెస్ట్‌ చేస్తోన్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లాయర్‌ యూసుఫ్‌ ఖాన్‌ జై హింద్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను నడిపిస్తున్నాడు. ఈ గ్రూప్‌లో స్తానిక పోలీస్‌ అధికారులు కూడా ఉన్నారు.

అయితే వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న ఫిరోజ్‌ ఖాన్‌ అనే వ్యక్తి కరోనాపై పుకార్లు సృష్టించేలా, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఉన్న పోస్టులను పెడుతూ, మరోవైపు మత ఘర్షణలు చెలరేగేలా పోస్టులు పెట్టి వాటిని అందరూ షేర్‌ చేయాలని కోరాడు. దీంతో పోలీసులు గ్రూప్‌ అడ్మిన్‌ యూసుఫ్‌ ఖాన్‌, సభ్యుడు ఫిరోజ్‌ఖాన్‌ ను అదుపులోకి తీసుకున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo