కొవిషీల్డ్ వర్సెస్ కొవాగ్జిన్.. ఏ వ్యాక్సిన్ ధర ఎంత?

న్యూఢిల్లీ: ఇంకా కొద్ది రోజుల్లోనే ఇండియాలో తొలి కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం మార్కెట్లోకి రాబోతోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కొద్ది వారాల్లోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామని ఇప్పటికే కొవిషీల్డ్ తయారు చేసే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండు వ్యాక్సిన్లు ఎలా తయారు చేశారు? దేని ధర ఎంత అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఎవరు అభివృద్ధి చేశారు?
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇక్కడ తయారు చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా సంస్థ. కొవాగ్జిన్ మాత్రం ఇండియాలోనే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలతో కలిసి ఈ టీకాను అభివృద్ధి చేసింది.
ఎలా అభివృద్ధి చేశారు?
చింపాంజీలలో కనిపించే కామన్ కోల్డ్ వైరస్ (అడెనో వైరస్) బలహీనపరిచిన వెర్షన్‌ను కొవిషీల్డ్ అభివృద్ధిలో ఉపయోగించారు. ఇందులో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌కు సంబంధించిన జన్యు పదార్థాన్ని కూడా వాడారు. వ్యాక్సినేషన్ తర్వాత స్పైక్ ప్రొటీన్ ఉత్పత్తయి, వైరస్‌పై దాడి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది.
ఇక కొవాగ్జిన్ అనేది ఒక నిష్క్రియం చేసిన (ఇన్‌యాక్టివేటెడ్) వ్యాక్సిన్. రోగానికి కారణమైన సూక్ష్మజీవులను నిష్క్రియం (చంపడం) చేయడం ద్వారా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇన్‌యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటారు.
దేని సామర్థ్యం ఎంత?
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలకు సంబంధించిన డేటాను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీని ప్రకారం వ్యాక్సిన్ సామర్థ్యం 70.42 శాతంగా తేలింది. తొలి దశలో 23,745 మందిపై ప్రయోగాలు చేశారు. రెండు, మూడు దశల్లో వచ్చిన ఫలితాలు కూడా ఇలాగే ఉన్నట్లు తెలిపింది.
భారత్ బయోటెక్ తొలి, రెండో దశల్లో 800 మందిపై ప్రయోగాలు నిర్వహించింది. వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసినట్లు చెప్పినా ఎంత శాతం అనేది మాత్రం వెల్లడించలేదు.
ఏ టీకా ధర ఎంత?
ప్రస్తుతానికి వ్యాక్సిన్ అందుకోబోయే తొలి మూడు కోట్ల మందికి ఉచితంగానే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాతే వ్యాక్సిన్ ధరను ఈ రెండు సంస్థలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే కొవిషీల్డ్ ధర రూ.400 వరకు ఉండవచ్చని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా గతంలో వెల్లడించారు. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధర మాత్రం రూ.100లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇవి కూడా చదవండి
వ్యాక్సిన్ వచ్చేసింది.. కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు డీసీజీఐ అనుమతి
ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ డౌటే!
దర్శక నిర్మాతలకు థియేటర్లపై ఇంకా నమ్మకం కుదరలేదా..?
తాజావార్తలు
- యాప్‌లపై నిషేధం డబ్ల్యూటీవో నియమాల ఉల్లంఘనే..
- ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం
- అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష
- పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్...!
- అరెస్ట్ చేయకుండా ఆపలేం.. తాండవ్ మేకర్స్‌కు సుప్రీం షాక్
- కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం
- చిక్కుల్లో నాని 'అంటే సుందరానికి '..!
- పక్కా కుట్రతోనే ఢిల్లీలో హింస: దిగ్విజయ్ సింగ్
- బిహార్‌లో కలకలం : బీజేపీ నేతపై కాల్పులు
- వరల్డ్ నంబర్ వన్ చేతిలో ఓడిన సింధు