బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 14:51:02

మ‌త స్వేచ్ఛకు ప‌రిధి ఏమిటి ?

మ‌త స్వేచ్ఛకు ప‌రిధి ఏమిటి ?

హైద‌రాబాద్‌:  శ‌బ‌రిమ‌ల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. మ‌త స్వేచ్ఛ గురించి ధ‌ర్మాస‌నం ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  రివ్యూ పిటిష‌న్ల ద్వారా ఈ అంశాన్ని మ‌రింత విస్తృత ధ‌ర్మాస‌నానికి పంపాల‌ని తొమ్మిది మంది స‌భ్యుల ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.  దీనిలో భాగంగా ఏడు ప్ర‌శ్న‌ల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం విచారించ‌నున్న‌ట్లు చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు.  మ‌త‌స్వేచ్ఛ‌కు ప‌రిధి ఏమిటి, ఆర్టిక‌ల్ 25, 26 ప్ర‌కారం పౌరుల హ‌క్కులు, మ‌త హ‌క్కులు రాజ్యాంగంలోని మూడ‌వ పీఠిక‌లో భాగ‌మా, మ‌త స్వేచ్ఛ‌కు ప్రాథ‌మిక హ‌క్కులకు మధ్య ఉన్న సంబంధం ఉందా,   ఆర్టిక‌ల్ 25(2)(బి) కింద హిందువులంటే ఎవ‌రు, మ‌తానికి సంబంధం లేని వ్య‌క్తి.. ఆ మ‌తాన్ని ప్ర‌శ్నించే హ‌క్కు ఉందా లేదా అన్న ప్ర‌శ్న‌ల‌ను కోర్టు ప‌రిశీలించ‌నున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ నుంచి రోజువారీగా విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.  logo
>>>>>>