సోమవారం 25 మే 2020
National - Mar 31, 2020 , 14:29:05

త‌బ్లిగీ జ‌మాత్‌ మ‌ర్క‌జ్ అంటే ఏమిటి ?

త‌బ్లిగీ జ‌మాత్‌ మ‌ర్క‌జ్ అంటే ఏమిటి ?

హైద‌రాబాద్‌:  త‌బ్లిగీ, జ‌మాత్‌, మ‌ర్క‌జ్. ఈ మూడు భిన్న ప‌దాలు.  త‌బ్లిగీ అంటే అల్లా సందేశాన్ని ప్ర‌చారం చేసేవారు.  జ‌మాత్ అంటే స‌మూహం.  మ‌ర్క‌జ్ అంటే మీటింగ్ కోసం ఏర్పాటైన స్థ‌లం.  ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్న అంశాలు ఇవే. ఇటీవ‌ల‌ నిజాముద్దీన్‌లో ఇస్లాం మ‌త‌స్తులు భారీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే త‌బ్లిగీ జ‌మాత్‌.  ముస్లింలు దేవుడిగా భావించే అల్లా ఇచ్చిన సందేశాల‌ను ప్ర‌చారం చేయ‌డం వీళ్ల క‌ర్త‌వ్యం. ఇదో ధార్మిక ప్ర‌చారం. ఈ వ్య‌వ‌స్థ‌తో సంబంధం ఉన్న‌వాళ్లు సాంప్ర‌దాయ ఇస్లాం మ‌తాన్ని పాటిస్తుంటారు. ఆ విష‌యాల‌ను వీళ్లు ప్ర‌చారం చేస్తుంటారు. త‌బ్లిగీ జ‌మాత్ ముఖ్య కార్యాల‌యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న‌ది. ఈ సంస్థ‌లో సుమారు 15 కోట్ల మంది స‌భ్యులుగా ఉన్నారు. 20వ శ‌తాబ్ధంలో ప్రపంచ‌వ్యాప్తంగా త‌బ్లిగీ జ‌మాత్ భారీ ఇస్లామిక్ ఉద్య‌మాన్ని చేప‌ట్టింది. 

త‌బ్లిగీ జ‌మాత్ ఎలా మొద‌లైంది..

ముస్లింలు త‌మ ధ‌ర్మాన్ని కాపాడుకునేందుకు త‌బ్లిగి జ‌మాత్ ఉద్య‌మాన్ని ప్రారంభించారు. ఇస్లాంను ప్ర‌చారం చేయ‌డం, ఆ మ‌తానికి సంబంధించిన అంశాల‌ను తెలియ‌జేయ‌డం మొద‌లుపెట్టారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో.. చాలా మంది ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ త‌ర్వాత వాళ్లంతా మ‌ళ్లీ హిందూ మ‌తాన్ని స్వీక‌రించ‌డం మొద‌లుపెట్టారు.  బ్రిటీషు పాల‌న స‌మ‌యంలో ఆర్య స‌మాజం మతం మారిన వారిని శుద్దీక‌రించి హిందువులుగా స్వీక‌రించ‌డం ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే త‌మ మ‌త ప్రాశ‌స్త్యాన్ని కాపాడుకునేందుకు మౌలానా ఇలియాస్ కంద‌ల్వి ఇస్లాం మ‌త ప్ర‌చారం మొద‌లుపెట్టారు.

 1927లో త‌బ్లిగీ జ‌మాత్ ఆందోళ‌న ప్రారంభ‌మైంది. హ‌ర్యానాలోని నుహూ జిల్లా నుంచి మౌలానా ఇలియాస్ కంద‌ల్వి ఈ ఉద్య‌మాన్ని మొదలుపెట్టారు. జ‌మాత్‌లో ఆరు ముఖ్య సూత్రాలు పాటిస్తున్నారు.  క‌లిమా, స‌లాత్‌, ఇల‌మ్‌, ఎక్ర‌మ్ ఈ ముస్లిమ్‌, ఇక్లాస్ ఏ నియాత్‌, దావ‌త్ ఓ త‌బ్లిగ్‌ల‌ను జ‌మాతీలు క‌చ్చితంగా అవ‌లంబిస్తారు. ప్ర‌స్తుతం త‌బ్లిగీ జ‌మాత్ శాఖ‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 213 దేశాల్లో ఉన్నాయి.  అయితే ఈనెల 13-15 మ‌ధ్య‌న ఢిల్లీలో జ‌రిగిన త‌బ్లిగీ జ‌మాత్ స‌మావేశానికి వేల మంది హాజ‌ర‌య్యారు. దాంట్లో ఇప్ప‌టికే ఆరు మంది క‌రోనా వైర‌స్‌తో మృతిచెందారు.  మ‌రో 24 మందికి పాజిటివ్ తేలింది.  దేశ‌మంతా విస్త‌రించిన ధార్మిక ప్ర‌చార‌కుల‌తో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారింది. 



logo