శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 15:35:28

ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోంది.. ప్రజలు ఎందుకు భయపడుతున్నారు..?

ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోంది.. ప్రజలు ఎందుకు భయపడుతున్నారు..?

కోల్‌కతా: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు భయపడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎందుకు జంకుతున్నారో అక్కడి ప్రభుత్వం గ్రహించాలని ఆమె అన్నారు. ఒక ఘటనలో పలువురు పోలీసులు చనిపోయారంటూ కాన్పూర్ ఎన్‌కౌంటర్ ఘటనను గుర్తు చేశారు. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీపై మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్ ప్రజలను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనికి తమ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని చెప్పారు. బయట వ్యక్తులెవరూ రాష్ట్రాన్ని పాలించలేరని, కొంత మందికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదని మమత విమర్శించారు. అలాంటి వారు కేవలం హత్యల గురించి, ప్రజలను రెచ్చగొట్టే అంశాల గురించే మాత్రమే మాట్లాడతారంటూ మండిపడ్డారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీని తరిమేస్తామని, తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని మమత అన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రంతోపాటు కేంద్రానికి దిక్సూచీ వంటివని ఆమె చెప్పారు.

 


logo