మంగళవారం 02 జూన్ 2020
National - May 13, 2020 , 17:25:21

ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ఏమిటీ?

ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ఏమిటీ?

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్రమోదీ రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినపుడు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ గురించి ప్రస్తావించారు. ఐదు మూల సూత్రాలుగా ప్రధాని మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ను ప్రకటించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అసలు దీనికి అర్థమేంటని అందరూ అనుకుంటుండగా సీతారామన్‌ దానిగురించి వివరించారు. అత్మనిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని అన్నారు. గత కొంత కాలంగా మనదేశం సాధించిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాజెక్ట్‌ తీసుకొస్తున్నామని ఆమె చెప్పారు. ఈ నినాదం దేశప్రజల్లో నూతనోత్తేజాన్నిఇస్తుందన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తం చేసి భారత్‌ స్వీయంగా ఎదగడమే ఈ ప్పాజెక్టు లక్ష్యమని ఆమె వివరించారు. 


logo