అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలనే తపనతో సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది జాన్వీ. ఇదిలా ఉంటే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్ ఎంట్రీపై కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ఇటీవలే లాస్ ఏంజెల్స్ లోని యాక్టింగ్ స్కూల్లో హయ్యర్ స్టడీస్ పూర్తి చేసిన ఖుషీకపూర్ ముంబైకి తిరిగొచ్చింది.
ఖుషీకపూర్ ను బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే బోనీకపూర్ మాత్రం తన చిన్న కూతురిని టాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్నాడట. పలువురు టాప్ డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలతో చర్చలు కూడా జరుపుతున్నట్టు టాక్. ఖుషీ కపూర్ ఎంట్రీపై ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు