సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 12:34:17

కరోనా పేషెంట్ల మెనూ ఇదే..

కరోనా పేషెంట్ల మెనూ ఇదే..

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. కరోనా సోకిన వారి కోసం దేశంలో తొలిసారిగా కేరళలోనే ఐసోలేషన్‌ వార్డులను ప్రారంభించారు. ఈ వార్డుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు, అనుమానితులు చికిత్స పొందుతున్నారు. కేరళలో మొత్తం 24 కేసులు నమోదు అయ్యాయి. 268 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక మెనూ ఏర్పాటు చేసింది. ఎర్నాకులం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సుహాస్‌ వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు రకాల మెనూలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఒక మెనూ మన దేశస్తులకు, మరో మెనూను విదేశీయులకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మన దేశస్తుల మెనూను చూస్తే.. బ్రేక్‌ఫాస్ట్‌ కోసం దోశ, సాంబార్‌, రెండు గుడ్లు, ఆరెంజ్‌ పండ్లు, టీ అందజేస్తున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పండ్ల రసం ఇస్తున్నారు. లంచ్‌కు చపాతీలు, కేరళ మీల్స్‌తో పాటు చేపల ఫ్రై, మినరల్‌ వాటర్‌ ఇస్తున్నారు. మూడు గంటల సమయంలో టీతో పాటు బిస్కెట్లు, ఇక డిన్నర్‌లో అన్నంతో పాటు రెండు అరటి పండ్లు అందజేస్తున్నారు. 

విదేశీయుల మెనూ.. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లతో పాటు సూప్‌, రెండు గుడ్లు ఇస్తున్నారు. లంచ్‌కు టోస్టెడ్‌ బ్రెడ్‌, చీజ్‌, పండ్లు, మూడు గంటల సమయంలో టీకి బదులుగా పండ్ల రసం, డిన్నర్‌లో టోస్టెడ్‌ బ్రెడ్‌, గుడ్లు, పండ్లు అందజేస్తున్నారు. ఇక ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి న్యూస్‌ పేపర్‌ అందుబాటులో ఉంచుతున్నారు. logo