శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 11, 2020 , 00:46:59

లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయాలేమిటి?

లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయాలేమిటి?

  • రాష్ర్టాలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ 14వ తేదీతో ముగియనుండటంతో కేంద్ర హోం శాఖ స్పందించింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని రాష్ర్టాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. అందులో వివరాలు ఇలా ఉన్నాయి.

  • లాక్‌డౌన్‌కు సంబంధించి అన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోండి.
  • ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నుంచి ఏమైనా మినహాయింపులు కోరుతున్నారా?
  • ప్రభుత్వ సేవలుగానీ, ప్రజలకు సంబంధించిన విషయాల్లోగానీ సడలింపులు కావాలా?
  • వ్యవసాయంతో ముడిపడిన పనులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉన్నది. కాబట్టి రైతులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడండి.
  • సరకు రవాణా సవ్యంగా సాగేలా చూడండి.
  • మీరిచ్చే సూచనలు, అభిప్రాయాలు కరోనా వ్యాప్తిని నిరోధించడంలోనూ, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలోనూ ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

సామూహిక కార్యక్రమాలను అనుమతించొద్దు

ఏప్రిల్‌ నెలలో పలు పండుగలున్న దృష్ట్యా మతపరమైన సామూహిక కార్యక్రమాలను అనుతించవద్దని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. 


logo