శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Aug 01, 2020 , 15:53:21

మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన క‌రోనా రాక‌పోదు.. ఈ జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి!

మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన క‌రోనా రాక‌పోదు.. ఈ జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి!

అమ్మో.. క‌రోనా వ‌స్తుందేమో అని మాస్క్ పెట్టుకొని నాకు రాదులే అని సంబ‌ర‌ప‌డిపోతే స‌రిపోదు. మిగిలిన జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి. లేకుంటే మాస్క్ పెట్టుకొని కూడా వేస్టే అంటున్నారు నిపుణులు. ఈ మాట‌లు వ‌ట్టిగా ఏం చెప్ప‌డం లేదు. దీని మీద ఒక ప‌రిశోధ‌న కూడా చేశారు. దీన్ని ఉద్దేశించే ఈ మాట‌లు అంటున్నారు.

ప్ర‌జ‌లు ఎక్కువ‌గా రిస్క్ కాంపెన్సేష‌న్ తీసుకుంటున్నారు. అంటే మాస్క్ ఒక‌టే ధ‌రించి మిగిలిన జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేదు. దీనివ‌ల్ల ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుంద‌నే దానిపై స్ట‌డీ చేశారు. మొద‌ట్లో ఆరోగ్య సంస్థ కూడా ఈ విష‌య‌మే చెప్పింది. కానీ ఇదేదీ క‌రెక్ట్ కాద‌ని స్ట‌డీలో తేలింది. మాస్క్ పెట్టుకున్న‌ వారే మిగిలిన జాగ్ర‌త్త‌లు కూడా పాటిస్తున్నార‌ని వెల్ల‌డైంది. వీరు గ‌నుక ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌రోనా ప్ర‌భావం మరింత ఎక్కువ‌గా ఉండేద‌ని అంటున్నారు. 


  


logo