శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 11:26:09

‘ఐస్‌క్రీమ్ వ‌డ‌పావ్’.. ఈ కాంబినేష‌న్ వంట‌కం చూస్తే తిట్టడం ఖాయం!

‘ఐస్‌క్రీమ్ వ‌డ‌పావ్’.. ఈ కాంబినేష‌న్ వంట‌కం చూస్తే తిట్టడం ఖాయం!

ఈ మ‌ధ్య‌ ర‌క‌ర‌కాల వంట‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మొన్న‌టికి మొన్న దోశ మీద మ్యాగీ, ర‌క‌ర‌కాల సాస్‌లు వేసి దాన్ని ముక్క‌లు ముక్క‌లు క‌ట్ చేసి దానికో పేరు పెట్టి కొనుగోలు చేశాడు. దోశ ప్రియులు దాన్ని చూసి మండిప‌డినా, వైరైటీని ఇష్ట‌ప‌డేవాళ్లు మాత్రం స్వీక‌రించారు. ఇప్పుడు అలాంటి వంట‌కం మ‌రొక‌టి వ‌చ్చింది. అదే 'ఐస్‌క్రీమ్ వ‌డ‌పావ్'‌. దీన్ని కాంబినేష‌న్ విన‌గానే నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఇక త‌యారు చేసిన వీడియో చూస్తే అంతే ఇక‌..

ఈ వీడియోను సాహిల్ అదికారి అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. సాధార‌ణంగా ముంబై డిఫ్రెంట్ వంట‌కాల‌కు మారుపేరు. అందుకేనేమో ఇలాంటి వంట‌ల త‌యారీకి పాల్ప‌డుతున్నారు. ముంబై చెఫ్‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకొని గుజ‌రాత్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఈ రెసిపీ త‌యారీకి పూనుకున్నాడు. ఆ వ్య‌క్తి వ‌డాపావ్ బ‌న్‌లో కొన్ని సాస్‌లు వేశాడు. త‌ర్వాత ఫ్రిజ్‌లో ఉన్న వ‌నిల్లా ఐస్‌క్రీమ్‌ను బ‌న్నులో పెట్టాడు. దానిమీద మ‌ళ్లీ సాస్‌తో డిజైన్ చేశాడు. ఇది చూడ‌టానికి టూటీఫ్రూటీలా క‌నిపిస్తుంది. ఈ క్రేజీ కాంబిష‌న్ చూసి ఒక్కొక్క‌రు ముఖం తిప్పుకుంటున్నారు. మ‌రి ఈ వంట‌కం ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. 

తాజావార్తలు


logo