శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 00:14:19

408 ప్రత్యేక రైళ్లలో 79వేల టన్నుల సరకుల రవాణా : పశ్చిమ రైల్వే

408 ప్రత్యేక రైళ్లలో 79వేల టన్నుల సరకుల రవాణా : పశ్చిమ రైల్వే

ముంబై : మార్చి 23 నుంచి జూలై 18 వరకు 79వేల టన్నుల నిత్యావసర సరుకులను రవాణా చేసినట్లు పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) ఆదివారం తెలిపింది. వీటిని 408 ప్రత్యేక రైళ్లలో రవాణా  చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తి, ఔషధాలు, చేపలు, పాలు ఉన్నాయి. ఈ రవాణా ద్వారా ఆదాయం సుమారు రూ.25.20 కోట్లు ఆదాయం వచ్చిందని పశ్చిమ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ ఆఫీసర్‌ (పీఆర్‌ఓ) సుమిత్‌ పేరిట విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో 60 పాల కోసం ప్రత్యేకంగా పశ్చిమ రైల్వే నడిపిందని, 45వేల టన్నులకుపైగా లోడ్‌, వంద శాతం వ్యాగన్ల వినియోగంతో సుమారు రూ.7.80 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.

వివిధ నిత్యావసర సరుకులను రవాణా చేయడానికి 29వేల టన్నులకుపైగా లోడ్‌తో మొత్తం 336 కొవిడ్‌-19 ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా రూ.14.82 కోట్లు వచ్చాయని ఠాకూర్‌ వివరించారు. మార్చి 22 నుంచి జూలై 18 వరకు లాక్‌డౌన్‌ కాలంలో 19.29 మిలియన్‌ టన్నుల విలువైన నిత్యావసరాలను సరఫరా చేసేందుకు పశ్చిమ రైల్వే ద్వారా 9,536 గూడ్స్‌ రైళ్లను వినియోగించామని ప్రకటనలో తెలిపారు. ‘18,680 సరుకు రవాణా రైళ్లు ఇతర జోనల్ రైల్వేలతో పరస్పరం మార్చబడ్డాయని, ఇందులో 9323 రైళ్లు అప్పగించబడ్డాయని, 9357 రైళ్లను వేర్వేరు ఇంటర్ ఛేంజ్‌ పాయింట్ల వద్ద స్వాధీనం చేసుకున్నారు’ అని పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo