బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 16:20:06

బెంగాల్‌ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి కరోనాతో మృతి

బెంగాల్‌ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి కరోనాతో మృతి

కోల్‌కతా: సీపీఎం సీనియర్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ రవాణా శాఖ మంత్రి శ్యామల్‌ చక్రవర్తి (76) కరోనా వల్ల గురువారం మరణించారు. వ్యాపార సంఘాల నాయకుడైన ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోల్‌కతాలోని దవాఖానలో చికిత్స పొందుతున్న శ్యామల్‌ చక్రవర్తి గురువారం మధ్యాహ్నం చనిపోయినట్లు సీపీఎం తెలిపింది. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అంటూ ట్విట్టర్‌లో సంతాపం తెలిపింది. గౌరవసూచికంగా పార్టీ జెండాను అవతనం చేస్తున్నట్లు పేర్కొంది. 


తాజావార్తలు


logo