శనివారం 23 జనవరి 2021
National - Dec 26, 2020 , 17:16:33

అక్క‌డ జూన్ 1 నుంచి 10th ప‌రీక్ష‌లు

అక్క‌డ జూన్ 1 నుంచి 10th ప‌రీక్ష‌లు

కోల్‌క‌తా: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పూర్తిగా త‌గ్గ‌క‌పోయినా విద్యార్థుల భవిష్య‌త్తు కోసం క‌నీసం 10th, ఇంట‌ర్ విద్యార్థుల‌కైనా వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ప‌లు రాష్ట్రాలు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయి. ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం ఒక అడుగు ముందుకేసి ఏకంగా ప‌రీక్ష‌ల తేదీల‌నే ప్ర‌క‌టించేసింది. 

వెస్ట్‌బెంగాల్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ బోర్డు (ప‌ద‌వ త‌ర‌గ‌తి) ప‌రీక్ష‌ల‌ను 2021, జూన్ 1 నుంచి, హయ్య‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ బోర్డు (ఇంట‌ర్‌) ప‌రీక్ష‌ల‌ను 2021, జూన్ 15 నుంచి నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప‌శ్చిమ‌బెంగాల్ ఉన్న‌త విద్యామండ‌లి ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo